ఏపీపీఎస్సీ గ్రూప్ II 2019 ప్రధాన పరీక్ష – హాజరైన అభ్యర్థులు, తొలి కీ, అభ్యంతరాల స్వీకరణ, పోస్టులు-జోన్లవారీగా ప్రాధాన్యత

హాజరైన అభ్యర్థులు

ఏపీపీఎస్సీ గ్రూప్ II 2019 ప్రధాన పరీక్ష- తొలి ‘కీ’  06-09-2019 న విడుదల చేసింది. గ్రూప్-2 మెయిన్స్‌ అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆగస్టు 29, 30 తేదీల్లో పరీక్షలు నిర్వహించింది. 23 పరీక్ష కేంద్రాల్లో 6,106 మంది అభ్యర్థులు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోగా 5,770 (94.49%) మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు.

తొలి కీ – Initial Key (Published on 06/09/2019):

అభ్యంతరాల స్వీకరణ

ఏదైనా ప్రశ్న లేదా కీపై అభ్యంతరాలను దాఖలు చేయాలని కోరుకుంటే, అతను / ఆమె కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్న నిర్దేశిత ఫార్మాట్లో దాఖలు చేయవచ్చు. హాల్ టికెట్ యొక్క స్వీయ-ధృవీకరించిన ప్రతిని కూడా జతపరచాలి. అభ్యంతరాలను 16.09.2019 సాయంత్రం 05:00 PM వరకు మాత్రమే స్వీకరించబడతాయి. అభ్యంతరాలను సాంప్రదాయ కాగితపు ప్రతిలో మాత్రమే పంపవలెను. ఎటువంటి ఎలెక్ట్రానిక్ పద్ధతిలో పంపకూడదు. పోస్టల్ ఆలస్యానికి కమీషన్ బాధ్యత కాదు.

పోస్టులు-జోన్లవారీగా ప్రాధాన్యత

గ్రూప్-2 స్క్రీనింగ్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు పోస్టులు-జోన్లవారీగా ప్రాధాన్యతను నమోదు చేసుకోవాల్సిందిగా ఏపీపీఎస్సీ కోరింది. అభ్యర్థులు పోస్టులు, జోన్లవారీగా ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఇచ్చిన ప్రాధాన్యాల ప్రకారమే పోస్టులకు ఎంపిక చేస్తారు.