ఏపీపీఎస్సీ గ్రూప్ III పంచాయితీ సెక్రటరీ – 2019 ప్రధాన పరీక్ష వ్యూహం

ఏపీపీఎస్సీ గ్రూప్ III పంచాయితీ సెక్రటరీ 2019 ప్రిలిమ్స్ / స్క్రీనింగ్ పరీక్ష విజయవంతంగా పూర్తయ్యి ఒక నెల కావస్తోంది. ఫలితాల కోసం వేచి ఉండకుండా, మీరు చదవటం ఇది వరకే ప్రారంభించి ఉంటారు. అలా కానిచో, తక్షణమే మొదలు పెట్టండి. ఈ సారి అర్హత పొందకపోయినా, మరుసటి సారి ఖచ్చితంగా మీకు సహాయం చేస్తుంది.

స్క్రీనింగ్ టెస్ట్ కోసం మీరు కొన్ని అంశాలను విడిచి ఉండవచ్చు. కానీ మీరు ఇప్పుడు ఏ అంశాన్ని వదిలిపెట్టకూడదు. మీరు సిలబస్లో పేర్కొన్న అన్ని అంశాలని అధ్యయనం చేయాలి. స్క్రీనింగ్ టెస్ట్ మరియు మెయిన్స్ రెండింటికీ సిలబస్ ఒకేలా ఉండటం వలన మీరు స్క్రీనింగ్ టెస్ట్కు సూచించిన పుస్తకాలు మరియు వనరులను మాత్రమే అధ్యయనం చేయాలి.

మీకు మూడు నెలల సమయం మాత్రమే ఉన్నది. చదవాల్సినవి రెండు పేపర్లు. జూన్లొ ఒక పేపర్, జూలైలో ఇంకో పేపర్ చదివి, ఆగస్ట్ లో పునశ్చరణ చేస్తే సరిపోతుంది.

మీరు ఎంత చదివిన, చివరగా సమాధానం తప్పుగా పెడితే, అంత వృథా అవుతుంది. కొన్ని సార్లు, తెలిసిన ప్రశ్నకి కూడా అయోమయంలో తప్పు సమాధానం పెట్టడం జరుగుతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే, 2016/2019 ఏపీపీఎస్సీ గ్రూప్ I / గ్రూప్ II / గ్రూప్ III III పాత ప్రశ్నాపాత్రాలని ఒకసారి అభ్యాసం చేస్తే చాలా ఉపయోగపడుతుంది.

2019 గ్రూప్- III స్క్రీనింగ్ టెస్ట్ విశ్లేషణ – ప్రాథమిక, ప్రత్యక్ష మరియు సాధారణ అంశాలు

ప్రశ్నలు బేసిక్స్ మరియు వాస్తవికత మీద ఎక్కువగా ఉన్నాయి. విశ్లేషణ పరిధి చాలా తక్కువ. మీరు ఈ మూడు కోణాలలో కేంద్రీకృతమై ఉంటే, మీరు తప్పనిసరిగా మెయిన్స్ జాబితాలో ఉంటారు. పంచాయితీ కార్యదర్శి 2016 ప్రశ్నాపత్రాల నుండి నేరుగా 4 ప్రశ్నలు ఉన్నాయి. 70 కంటే ఎక్కువ ప్రశ్నలు ఆంధ్ర ప్రదేశ్ కు సంబంధించినవి. మెయిన్ ఎగ్జామినేషన్ కూడా స్క్రీనింగ్ టెస్ట్ లాగానే ఉండవచ్చు.