రాజముద్ర

తెలుగు మాధ్యమంలో ప్రభుత్వ పరీక్షలను ఛేదించడానికి “రాజముద్ర” మీకు స్నేహితురాలుగా, తత్వవేత్తగా మరియు మార్గదర్శకురాలుగా ఉపయోగపడుతుంది. మీరు ఎవరైనా, ఎటువంటి వారైనా, మీ చదువు ఇంత వరకు ఎలా ఉన్నా, మీరు ప్రభుత్వ పరీక్షలను క్లియర్ చేయవచ్చు. ప్రభుత్వ సేవకుడు కావచ్చు. మీరు ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించిన తర్వాత, దేశానికి సేవ చేయాలని మర్చిపోకండి. అతి తక్కువ సమయంలో, అడ్డదారిలో ఉద్యోగాన్ని సాధించలేరు. ఇది సమయం తీసుకుంటుంది. శ్రమతో కూడిన పని. ఇది ఒక సవాలు. ఇతరులు మీ గురించి ఏమి చెప్తున్నారో నమ్మకండి. మీమీద మీరు నమ్మకాన్ని ఉంచండి. దేవుణ్ణి నమ్మండి. అద్భుతం జరుగుతుంది.

విషయాల ప్రాధమిక అంశాలను తెలుసుకోవడానికి కోచింగ్ తీసుకోవచ్చు. అయితే, కోచింగ్ మీద పూర్తిగా ఆధారపడటం ప్రయోజనం కంటే మరింత హాని చేస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందడానికి మేము మీకు మార్గనిర్దేశం చేస్తాము. మీరు వ్యూహాన్ని త్రికరణ శుద్ధితో పాటించినట్లైతే, ప్రభుత్వ ఉద్యోగం పొందడం అంత కష్టమైన పని కాదు.

పోటీ పరీక్షలలో విజయం సాధించడం చాలా కష్టం. విజయం చాలా సార్లు మిమ్మల్ని ఊరిస్తూ ఉంటుంది. చాలా మందికి అసాధ్యం కావచ్చు. కానీ ఏపీపీఎస్సీ, టీఎస్‌పీఎస్సీ మరియు యూపీఎస్సీ పరీక్షలలో విజయం సాధించాలంటే, ఈ క్రింది ప్రసిద్ధ కోట్ గుర్తుకు తెచ్చుకోవాల్సిందే.

అసాధ్యం అనేది అవివేకి నిఘంటువులో మాత్రమే కనిపించే పదం. – నెపోలియన్ బోనాపార్టే

అసాధ్యాన్ని సుసాధ్యంగా మార్చడానికి ఒక చక్కని వ్యూహం చాలా అవసరం. వ్యూహం ఉద్యోగానికే కాదు, జీవితంలో విజయానికి కూడా అవసరం. వ్యూహం అనేది ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని సాధించడానికి ఉద్దేశించిన కార్యాచరణ ప్రణాళిక.

వ్యూహం

వ్యూహం యొక్క ముఖ్య ఉద్ధేశ్యం మిమ్మల్ని భౌతికంగా మరియు మానసికంగా సంసిద్దం చేయడం. మీరు అంకితభావం, క్రమశిక్షణ, స్థిరత్వం, పట్టుదల, వైఖరి, అభ్యున్నతి లాంటి లక్షణాలని జీర్ణించుకోవాలి. ఇది వ్యాయామం ప్రారంభించడానికి ముందు చేసే వార్మప్ లాంటిది. వార్మప్ సరిగ్గా చేయకపోతే, శరీర నొప్పులు, మెడ నొప్పులే కాకుండా, ఆసుపత్రిలో కూడా చేరవలసి వస్తుంది.

సాధారణ వ్యూహంలో క్లుప్తంగా వీటి గురించి తెలుసుకోవాలి – పరీక్ష మరియు నియామక ప్రక్రియ, సిలబస్ మరియు స్కీమా, చదవాల్సిన పుస్తకాలు మరియు చదవకూడని పుస్తకాలు, ప్రణాళిక, సమయపాలన, విశ్రాంతి, ఏవి చదవాల్సినవి, ఏవి చదవకూడదు మరియు ఎప్పుడు, ఎక్కడ, ఎలా చదవాలి లాంటివి.

ఈ క్రింది పరీక్షలకు వ్యూహాన్ని రూపొందించాము. వాటిని క్లిక్ చేయండి.

ఏపీపీఎస్సీ

ఏపీపీఎస్సీ గ్రూప్ – I

ఏపీపీఎస్సీ గ్రూప్ – II

ఏపీపీఎస్సీ గ్రూప్ – III

ఏపీపీఎస్సీ గ్రూప్ – IV

యూపీఎస్సీ

సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్

ఇండియ‌న్ ఫారెస్ట్ స‌ర్వీస్ ఎగ్జామినేష‌న్‌