ఏపీపీఎస్సీ

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) వివిధ పరీక్షల ద్వారా ఉద్యోగాల భర్తీ చేస్తుంది. వాటిలో ముఖ్యమైనవి గ్రూప్స్ పరీక్షలు. వీటి ద్వారా పరిపాలన విభాగానికి చెందిన ఉద్యోగాలను పూరిస్తుంది. ఈ క్రింది పరీక్షలు వాటి కోసం నిర్వహిస్తారు.

గ్రూప్ – I : డెప్యుటీ కలెక్టర్, డెప్యుటీ ఎస్పీ వంటి అత్యున్నత పరిపాలన విభాగానికి చెందిన ఉద్యోగాలను గ్రూప్ – I క్రింద పరిగణిస్తారు.

గ్రూప్ – II : డెప్యుటీ తహసీల్దార్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ వంటి మధ్య స్థాయి పరిపాలన విభాగానికి చెందిన ఉద్యోగాలను గ్రూప్ – II క్రింద పరిగణిస్తారు.

గ్రూప్ – III : పంచాయితీ సెక్రటరీ వంటి దిగువ స్థాయి పరిపాలన విభాగానికి చెందిన ఉద్యోగాలను గ్రూప్ – III క్రింద పరిగణిస్తారు.

గ్రూప్ – IV : జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగాలను ఏపీపీఎస్సీ గ్రూప్ IV క్రింద పరిగణిస్తోంది.