ఏపీపీఎస్సీ గ్రూప్ I

డెప్యుటీ కలెక్టర్, డెప్యుటీ ఎస్పీ వంటి అత్యున్నత పరిపాలన విభాగానికి చెందిన ఉద్యోగాలను గ్రూప్ I క్రింద పరిగణిస్తారు. క్రింద ఉదహరించిన వ్యూహాత్మక ప్రణాళికతో గ్రూప్ I ఉద్యోగాలని సాధించవచ్చు.

అతి తక్కువ సమయంలో ఈ పరీక్షను ఎలా క్లియర్ చేయాలి?

ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ (వడపోత పరీక్ష)

  • మీరు ఇంజనీరింగ్ లేదా సైన్స్ బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చినట్లయితే, మీ మొదటి అధ్యయన విభాగం రెండవ పేపర్ – జనరల్ ఆప్టిట్యూడ్. ఈ విషయాలను 15 రోజుల్లో చాలా త్వరగా పూర్తి చేయండి.
  • మీరు ఆర్ట్స్ నేపథ్యంలో ఉన్నట్లయితే, మీ మొదటి అధ్యయన విభాగం మొదటి పేపర్ – జనరల్ స్టడీస్. ఈ విషయాలను 15 రోజుల్లో చాలా త్వరగా పూర్తి చేయండి.
  • గత 6 నెలల వర్తమాన అంశాలని క్షుణ్ణంగా చూడండి.

ప్రధాన పరీక్ష

  • ప్రధాన పరీక్షకు అధ్యయనం కంటే అభ్యాసం చాలా ముఖ్యం.
  • భారతదేశ మరియు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ, వ్యాసం, సైన్స్ అండ్ టెక్నాలజీ – ఈ మూడు వర్తమాన అంశాలతో చాలా ముడిపడి ఉంటాయి. మొదటగా వీటిల్ని పూర్తి చేయడానికి ప్రయత్నించండి. పాలిటీ, చరిత్ర లాంటివి తర్వాత పూర్తి చేయండి.

ముఖ్యమైన అంశాలు

  • తాజా చట్టాలు, రాజ్యాంగ సవరణలు మరియు మైలురాయి తీర్పులు
  • భారతదేశ ప్రభుత్వం మరియు ఆంధ్రప్రదేశ్ – కార్యక్రమాలు, పథకాలు మరియు పాలసీలు.

వ్యూహ ప్రణాళిక

2018-2019 ప్రకటనకు సంబంధించినవి