ఏపీపీఎస్సీ గ్రూప్ III – పంచాయితీ సెక్రటరీ

పంచాయితీ సెక్రటరీ వంటి దిగువ స్థాయి పరిపాలన విభాగానికి చెందిన ఉద్యోగాలను గ్రూప్ III క్రింద పరిగణిస్తారు. ఆంధ్రప్రదేశ్ పంచాయితీ రాజ్ సబార్డినేట్ విభాగంలో పంచాయితీ కార్యదర్శి (గ్రేడ్-IV) పదవిని ఏపీపీఎస్సీ గ్రూప్ III క్రింద పరిగణిస్తోంది. పంచాయతీ కార్యదర్శి పోస్టులు గ్రామాలు మరియు పంచాయతీల అభివృద్ధికి విలువైనవి. వడపోత పరీక్ష మరియు ప్రధాన పరీక్షలలో బహుళైచ్ఛిక ప్రశ్నలు మాత్రమే ఉంటాయి. రెండింటికీ సిలబస్ కూడా ఒకటే. క్రింద ఉదహరించిన వ్యూహాత్మక ప్రణాళికతో గ్రూప్ III ఉద్యోగాలని సాధించవచ్చు.

అత్యంత ముఖ్యమైన విషయాలు

  • గత ఆరు నెలల నుండి సంవత్సరంలోపు జరిగిన వర్తమాన అంశాలు
  • ఆంధ్రప్రదేశ్ పంచాయితీ వ్యవస్థ చట్టం.
  • భారత ప్రభుత్వ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు – ముఖ్యంగా గ్రామీణాభివృద్ధికి సంభంధించినవి.
  • 73వ మరియు 74వ రాజ్యాంగ సవరణ చట్టాలు – వాటికి దారి తీసిన పరిస్థితులు – అంటే సామాజిక అభివృద్ధి పథకాలు, వివిధ కమిటీలు, వాటి నివేదికలు.
  • ఆంధ్ర ప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే  (తాజాది)
  • ఆంధ్ర ప్రదేశ్ బడ్జెట్  (తాజాది)

కీలక నిర్ణయాలు మరియు ప్రణాళిక

అవగాహన

2019 ప్రకటనకు సంబంధించినవి

Leave a Reply