వ్యూహం

వ్యూహం అనేది ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని సాధించడానికి ఉద్దేశించిన కార్యాచరణ ప్రణాళిక. అసాధ్యాన్ని సుసాధ్యంగా మార్చడానికి ఒక చక్కని వ్యూహం చాలా అవసరం. మీరు క్రింది వ్యూహాన్ని పాటించినట్లైతే, ప్రభుత్వ ఉద్యోగం పొందడం అంత కష్టమైన పని కాదు. ఏ పరీక్షకైనా ఈ క్రింది వ్యూహ రచన చాలా చక్కగా సరిపోతుంది.

వ్యూహ రచన (ఏ పరీక్షకైనా)

 1. ముందుగా పరీక్ష మీద అవగాహన పెంచుకోవాలి.
 2. పాత ప్రశ్న పత్రాల సహాయంతో పరీక్ష విధానాన్ని విశ్లేషించండి.
 3. మంచి పుస్తకాలు మరియు వనరులను జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి.
 4. ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. ప్రణాళికని తూ . చ. తప్పకుండా పాటించాలి.
 5. పాత ప్రశ్న పత్రాల ఆన్‌లైన్ పరీక్షల సహాయంతో మీ సంసిద్ధతను తెలుసుకోండి.
 6. పరీక్షకు రెండు వారాల ముందు లేదా నెల రోజుల ముందు ఒకసారి పునర్విమర్శ చేయండి.
 7. పరీక్ష రోజు చాలా ప్రశాంతంగా ఉండాలి.
 8. పరీక్ష గదిలో చాలా పదునుగా ఉండాలి.

పుస్తకాలు మరియు వనరులు

ఏదైనా పరీక్షను ఛేదించడానికి, పుస్తకాలను జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి. కొన్ని పుస్తకాలు మరియు వనరులు మాత్రమే మీకు విజయాన్ని చేకూరుస్తాయి. 

ఏదైనా పరీక్షను ఛేదించడానికి, పుస్తకాలు మరియు వనరులను జాగ్రత్తగా ఎంపిక చేసుకోవడం తెలివైన విషయం. ఒక సాధారణ మనిషి వందలాది పుస్తకాలను చదవలేడు. మీరు పిహెచ్డి చేయటంలేదు. ఏదైనా ప్రభుత్వ ఉద్యోగానికి ఒక సాధారణ వివేకం ఉన్న వ్యక్తి సరిపోతాడు. అందువల్ల కొన్ని పుస్తకాలు మరియు వనరులు మాత్రమే మీకు విజయాన్ని చేకూరుస్తాయి. బ్రూస్ లీ ప్రసిద్ధ కోట్ మీకు కూడా వర్తిస్తుంది.

10,000 కిక్స్ సాధించిన వ్యక్తికి నేను భయపడను, కానీ ఒక కిక్ 10,000 సార్లు సాధించిన వ్యక్తికి నేను భయపడుతాను. – బ్రూస్ లీ

పరిమిత పుస్తకాలను మీరు అధ్యయనం చేసి, అపరిమిత పునర్విమర్శలను చేస్తే మీకు విజయము లభిస్తుంది. పుస్తకాలు ఎక్కువైనట్టు అనిపించినా కంగారు పడకండి. పుస్తకం అంతా చదవకుండా, సిలబస్ ప్రకారం మాత్రమే చదవాలి.

పునాది –  రాష్ట్ర ప్రభుత్వ పుస్తకాలు లేదా తెలుగు అకాడమీ పుస్తకాలు

రాష్ట్ర ప్రభుత్వ పుస్తకాలు లేదా తెలుగు అకాడమీ పుస్తకాలు పునాదిలా ఉపయోగపడతాయి. పునాది లేనిదే ఏ భవనాన్నీ పూర్తి చేయలేము. అలాగే ఈ పుస్తకాలు చదవకుండా ఏవేవో చదివితే మీకు కష్టమే తప్ప ఫలితం దక్కదు. ముఖ్యంగా ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు గల పుస్తకాలు బాగా ఉపయోగపడతాయి.

 • రాష్ట్ర ప్రభుత్వ పుస్తకాలు – ఆరవ తరగతి నుండి పదవ తరగతి
 • జనరల్ స్టడీస్ – తెలుగు అకాడమీ

పాలిటీ అండ్ గవర్నెన్స్ (రాజకీయ వ్యవస్థ మరియు ప్రభుత్వ పాలన)

 • భారతీయ రాజకీయ వ్యవస్థ (ఇండియన్ పాలిటీ) – యం. లక్ష్మికాంత్. (Indian Polity by M.Laxmikanth in Telugu medium)

భారతదేశ చరిత్ర మరియు సంస్కృతి

 • ప్రాచీన భారతదేశ చరిత్ర – వల్లంపాటి వెంకట సుబ్బయ్య మరియు రామ్ శరన్ శర్మ. (Ancient India by RS Sharma in Telugu medium )
 • మధ్యయుగాల భారతదేశం – సతీష్ చంద్ర. ( Medieval India by Satish Chandra in Telugu medium)
 • ఆధునిక భారతదేశ చరిత్ర  – బిపిన్ చంద్ర ( Modern India by Bipin Chandra in Telugu medium)
 • భారత స్వతంత్ర పోరాటం – బిపిన్ చంద్ర ( Indian National Movement by Bipin Chandra in Telugu medium)
 • స్వతంత్రం తర్వాత భారతదేశం – బిపిన్ చంద్ర (India After Independence by Bipin Chandra in Telugu medium)
 • భారతదేశ చరిత్ర-సంస్కృతి – తెలుగు అకాడమీ (B.A. Indian History-Culture books by Telugu Akademi)

ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ చరిత్ర మరియు సంస్కృతి

 • ఆంధ్రుల చరిత్ర – B.S.L. హనుమంత రావు (Andhrula Charitra by B.S.L. Hanumantha Rao)
 • ఆధునిక ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర  – పి. రఘునాథ రావు (History Of Modern Andhra Pradesh by P Raghunatha Rao)
 • ఆంధ్రప్రదేశ్ సమగ్ర చరిత్ర (AP Samagra Charithra) – P.V.K. Prasada Rao  
 • ఆంధ్ర ప్రదేశ్ విభజన చట్టం, 2014 – మాడ భూషి శ్రీధర్ (Madabhushi Sridhar A.P. Reorganistaion Act, 2014 in Telugu ) – ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 అధికారిక పత్రం
 • తెలంగాణ చరిత్ర – సంస్కృతి – తెలుగు అకాడమీ (BA Telangana History and Culture by Telugu Akademi)

భూగోళ శాస్త్రం

 • భౌతిక భూగోళ శాస్త్రం – తెలుగు అకాడమీ ( B.A / B.Sc. Physical Geography by Telugu Akademi)
 • సాంఘిక మరియు ఆర్థిక భూగోళ శాస్త్రం – తెలుగు అకాడమీ (B.A & B.Sc Socio-Economic Geography by Telugu Akademi)
 • ప్రపంచ భూగోళ శాస్త్రం – తెలుగు అకాడమీ (B.A / B.Sc. World Geogeaphy by Telugu Akademi)
 • భారతదేశ ప్రాంతీయ భూగోళ శాస్త్రం – తెలుగు అకాడమీ (BA Regional Geography Of India by Telugu Akademi)
 • ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతీయ భూగోళ శాస్త్రం – తెలుగు అకాడమీ (BA / B.SC Andhra Pradesh Regional Geography)
 • తెలంగాణ ప్రాంతీయ భూగోళ శాస్త్రం – తెలుగు అకాడమీ (Telangana Regional Geography by Telugu Akademi)

పర్యావరణం

 • పర్యావరణ భూవిజ్ఞాన శాస్త్రం – తెలుగు అకాడమీ (B.Sc Environmental Geology by Telugu Akademi)

విపత్తు నిర్వహణ

 • యోజన మాస పత్రిక (ఏదైనా ఒక సంచికలో విపత్తు నిర్వహణ మీద ప్రత్యేక కథనం ఉంటుంది.)

ఆర్థిక వ్యవస్థ మరియు అభివృద్ధి

 • భారతదేశ ఆర్థిక వ్యవస్థ  – తెలుగు అకాడమీ (Vol. I and II)
 • అభివృద్ధి సమస్యలు మరియు పరివర్తన (Issues of Development and Change by Telugu Akademi)
 • స్థూల అర్థ శాస్త్రం – తెలుగు అకాడమీ (BA Macro Economics by Telugu Akademi)
 • ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ  – తెలుగు అకాడమీ
 • తెలంగాణ ఆర్థిక వ్యవస్థ  – తెలుగు అకాడమీ

శాస్త్రీయ మరియు సాంకేతిక విజ్ఞానాలు

 • రాష్ట్ర ప్రభుత్వ పుస్తకాలు లేదా తెలుగు అకాడమీ పుస్తకాలు

జనరల్‌ ఆప్టిట్యూడ్‌

 • Quantitative Aptitude Fully Solved in Telugu by R.S. Aggarwal

వర్తమాన అంశాలు

 • ఈనాడు వార్తాపత్రిక (తెలుగు మరియు రాష్ట్ర స్థాయి వార్తలు కోసం)
 • ఈటీవీ న్యూస్ @ 9 PM
 • యోజన మాస పత్రిక (Yojana magazine in Telugu by Govt of India)
 • భారతదేశ ఆర్థిక సర్వే (తాజాది)
 • భారతదేశ బడ్జెట్ (తాజాది)
 • ఆంధ్రప్రదేశ్/తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే  (తాజాది)
 • ఆంధ్రప్రదేశ్/తెలంగాణ బడ్జెట్  (తాజాది)
 • ఆంధ్రప్రదేశ్/తెలంగాణ ప్రభుత్వ మాస పత్రిక

ఏపీపీఎస్సీ గ్రూప్ – I, టీఎస్పీఎస్సీ గ్రూప్ – I మరియు యూపీఎస్సీ సివిల్ సర్వీసస్

ఏపీపీఎస్సీ గ్రూప్ – I, టీఎస్పీఎస్సీ గ్రూప్ – I మరియు యూపీఎస్సీ సివిల్ సర్వీసస్ పరీక్షలకు చాలా సామీప్యం ఉంది. మీలో చాలా మంది ఈ పరీక్షలన్నింటికి విడివిడిగా సిద్ధం అవుతూ ఉండవచ్చు. కానీ విడివిడిగా తయారైతే, విజయం అంత సులువు కాదు. ఈ మూడు పరీక్షలకి ఉమ్మడిగా చదివితే, విజయం మిమ్మల్ని వరిస్తుంది. 

పరీక్ష విధానం ఈ మూడింటికీ ఒక్కటే. సిలబస్ కూడా కొద్దిగా అటుఇటుగా ఒకేలాగ ఉంటుంది. పరీక్షలలో అడిగే ప్రశ్నల విధానం, స్థాయి కూడా ఒకే విధంగా ఉంటాయి. చదివే విధానంలో, చదివే పుస్తకాలలో, ప్రణాళికలో ఏటివంటి మార్పు ఉండదు. 

వీటిల్ని సాధించటం కొద్దిగా కష్టమే. కానీ అసాధ్యం కాదు. వీటికి సారూప్యతలతో పాటు, కొన్ని విభేదాలు కూడా ఉన్నాయి. వీటన్నింటినీ సూక్ష్మంగా పరిశీలిస్తే విజయం మీదే. అందువలన ఒకే వ్యూహం ఈ పరీక్షలకు సరిపోతుంది.

సారూప్యతలు (Similarities)

 • ఒకే పరీక్షా విధానం – ప్రిలిమినరీ, మెయిన్స్ మరియు ఇంటర్‌వ్యూ .
 • చాలావరకు సిలబస్ ఒకటే.
 • పరీక్షలలో అడిగే ప్రశ్నల విధానం, స్థాయి ఒకే విధంగా ఉంటాయి.

విభేదాలు (Differences)


యూపీఎస్సీ సివిల్ సర్వీసస్ఏపీపీఎస్సీ గ్రూప్ – I / టీఎస్పీఎస్సీ గ్రూప్ – I 
జాతీయ అంశాల పైన అధిక దృష్టి పెట్టాలి.జాతీయ అంశాలతో పాటు, రాష్ట్రస్థాయి అంశాలపైన కూడా దృష్టి పెట్టాలి.
పరీక్ష విధానం, ప్రశ్నల తీరు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది.పరీక్ష విధానం, ప్రశ్నల తీరు సాధ్యమైనంత వరకు ఒకే విధంగా ఉంటుంది.
ప్రశ్నలు ఎక్కువగా విశ్లేషణాత్మకంగా ఉంటాయి. అంటే మీరు మీ మెదడుకు బాగా మేత పెట్టాలి.ప్రశ్నలు తక్కువ విశ్లేషణాత్మకంగా ఉంటాయి. (Less Analytical questions)
ప్రశ్నలు కొద్దిగా కష్టమైనవిగా ఉంటాయి.ప్రశ్నలు కొద్దిగా సులభమైనవిగా ఉంటాయి.

Leave a Reply